2 జులై, 2012

విక్రమ్ సినిమాకు 8 మంది మ్యూజిక్ డైరెక్టర్లు
చియాన్ విక్రమ్ నటిస్తున్న తమిళ చిత్రం ‘డేవిడ్' చిత్రానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం సమకూర్చనున్నారు. దీన్నో మ్యూజికల్ సెన్షేషన్‌గా తీర్చి దిద్దేందుకు ట్రై చేస్తున్నాడు దర్శకుడు బిజయ్ నంబియార్. ఈ చిత్రానికి సంబంధించి ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్‌ను ప్రశాంత్ పిళ్లై, అనిరుద్ రవిచందర్, రెమె, మోడర్న్ మాఫియా మరికొందరు కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ఫిషర్ మ్యాన్‌గా, జీవా మ్యూజీషియన్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఈ ఇద్దరి హీరోల పేరు ఒకటే..డేవిడ్. అయితే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు. అదే విధంగా ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్లు కూడా ఇద్దరు పని చేస్తున్నారు. రత్న వేలుతో పాటు సెజల్ కెమెరావర్క్ చూసుకుంటున్నారు. లారా దత్త, టబు, ఈషా శర్వానీ మరియు నాజర్ ఇతర ముఖ్య పాత్రల్లోనటిస్తున్నారు. గ్రేట్ వే ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరో వైపు విక్రమ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ‘ఐ' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించనున్న చిత్రంలో విక్రమ్ స‌ర‌స‌న‌ సమంత కథానాయిక అనే వార్తలు ఆ మధ్య వినిపించినప్పటిక ఇంకా ఖరారు కాలేదు. ప్రముఖ మళయాల హీరో సురేష్‌ గొపీ, తమిళ నటుడు శివాజి గ‌ణేష్ కుమారుడు, ప్రభు సోదరుడు రామ్‌కుమార్ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

చాలా కాలంగా హిట్ ద‌క్కక కోట్టుమిట్టడుతున్న విక్రమ్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. గతంలో శంకర్‌, విక్రమ్‌ కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ అపరిచితుడు చిత్రం కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. కాస్టూమ్స్ డిజైనర్‌గా ‘మెన్ ఇన్ బ్లాక్ ‘ చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ను ఎంపిక చేశారు. ఫైట్స్ చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ సమకూర్చనున్నాడు.