17 జులై, 2012

బిగ్‌సీలో 65శాతం డిస్కౌంట్..22వరకే!

హైదరాబాద్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సెల్‌ఫోన్ల కొనుగోళ్ల పై తాము అందిస్తున్న65శాతం రాయితీ ఇతర అంశాలతో కూడిన ఆఫర్‌లకు మిశ్రమ స్పందన లభిస్తుందని బిగ్ సీ సంస్థల చైర్మన్ ఎం.బాలు చౌదరి సోమవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ నెల 22వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ.4999 విలువైన సెల్-కాన్ సీ606 మొబైల్ ను రూ.1749కి ఆఫర్ చేస్తున్నామని, అంతేకాకుండా మొబైల్ కొనుగోలు పై సినిమాలతో లోడై ఉన్న 4జీబి మెమెరీ కార్డును ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.

రూ.5499 విలువైన కార్బన్ కె770 మొబైల్ ను రూ.1999కి, రూ.6499 విలువైన మైక్రోమ్యాక్స్ మొబైల్‌ను రూ.5199కి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

సామ్‌సంగ్ సీ3312, మైక్రోమ్యాక్స్ ఎక్స్277 సెల్‌ఫోన్‌ల కొనుగోలు పై 4జీబి మెమరీ‌కార్డ్, సామ్‌‍సంగ్ ఎస్5222, సెల్‌కాన్ ఎ88, ఎల్‌జీ ఇ400 మొబైల్స్ పై 8జీబి మెమెరీ కార్డును ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సోనీ డబ్ల్యూటీ13ఐ, హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్, సెల్‌కాన్ ఎ99 సెల్‌ఫోన్‌ల పై బ్లూటూత్ ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. మరికొన్ని ఎంపిక చేసిన మొబైల్స్ కొనుగోలు పై బంగారం-వెండి నాణేలు, వ్యాక్యూమ్ క్లీనర్లను బహుమతులుగా ఇస్తున్నట్లు బాలు చౌదరి తెలియజేశారు.