3 జులై, 2012

ఐటం‌సాంగులో రజనీకాంత్...రూ. 15 కోట్ల పారితోషికం!
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై బాలీవుడ్లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అమీర్ ఖాన్ హీరోగా రూపొందబోతున్న బాలీవుడ్ మూవీ ‘తలాష్' చిత్రంలో రజనీ ఐటం సాంగులో నర్తించబోతున్నారట. అయితే ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదని, ప్రస్తుతం రజనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రజనీ తప్పకుండా ఒకే చెబుతాడని అమీర్‌తో పాటు దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....ఈ చిత్రంలో ఐటం సాంగు చేసినందుకు రజనీకి రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట నిర్మాతలు. రజనీకాంత్ ఇప్పటి వరకు ఏ చిత్రంలోనూ ఐటం సాంగు చేయలేదు. ఆయన తొలి ఐటం సాంగు కావడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని, దక్షిణాదిన కూడా కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు అమీర్ ఖాన్ ఖ్యాతి సౌత్‌లో విస్తరిస్తుందనే ఆశతో ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది.

అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈచిత్రాన్ని రీమా కాగ్టి డైరెక్ట్ చేస్తున్నారు. రితేష్ సింధ్వానీ, అమీర్ ఖాన్, ఫరాన్ అక్తర్ ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30న తలాష్ విడుదలకు సిద్ధం అవుతోంది.

‘తలాష్'కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని రిలయన్స్ సంస్థ 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. గతంలో షారూక్‌ఖాన్ ‘డాన్2' చిత్రానికి ఇవే థియేట్రికల్ రైట్స్ క్రింద 80 కోట్లు లభించాయి. దాంతో ఇప్పుడు ఆ రికార్డుని చెరిపేసి కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లైంది.