12 జూన్, 2012

మాజీ లవ్వర్ కోసమే డుమ్మా కొట్టాడా?

                                     Sangeeta Bijlani Bonds With Ex Beau Salman


 ఇటీవల సింగపూర్లో జరిగిన IIFA అవార్డుల ఫంక్షన్‌కి హాజరు కాలేదు. విషయం ఏమిటా అని ఆరాతీయగా.....తన మాజ గర్ల్ ఫ్రెండ్ సంగీత బిజిలానీతో గడపడానికే అంటూ బాలీవుడ్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు కొన్ని బలమైన కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సంగీత ఇటీవల వీకెండ్‌లో సల్మాన్ సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ముంబై థియేటర్ల వద్ద దర్శనం ఇచ్చింది. మాజీ క్రికెటర్, ఎంపీ అజారుద్దీన్ భార్య అయిన సంగీత గత కొంత కాలంగా భర్తకు దూరంగా ముంబైలోనే టైంపాస్ చేస్తోంది. అజర్‌కు, సంగీతకు మధ్య సంబంధాలు సరిగా లేవని, ఈ నేపథ్యంలో సంగీత మళ్లీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ సల్మాన్‌కు అతని ఫ్యామిలీకి దగ్గరవుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
అటు సల్మాన్ IIFA అవార్డు ఫంక్షన్‌కు డుమ్మా కొట్టడం, ఇటు సంగీత సల్మాన్ ఫ్యామిలీతో క్లోజ్‌గా అవ్వడంతో మీడియాకు మాంచి మసాలా వార్తలు దొరికినట్లయింది. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతోందని అంటున్నారు.
ఇక పోతే సల్మాన్ ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ చేరుకున్నారు. తన క్లోజ్ ప్రెండ్ రామ్ చరణ్ వివాహం నేపథ్యంలో చెర్రీ ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చారు. చిరంజీవి దంపతులు సల్మాన్, జంజర్ టీంకు సాదర స్వాగతం పలికి గ్రాండ్ గా ట్రీట్ ఇచ్చారు. చరణ్ పెళ్లి వేడుక ముగిసే వరకు సల్మాన్ ఇక్కడే ఉంటాడని తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.