14 జూన్, 2012

వివాహానంతరం వేరే కాపురంపై రామ్ చరణ్

                                   Ram Charan About His After Marriage Plans

నేను ఆమెతో మనకోసం సెపరేట్ గా గోల్ప్ కోర్స్ ఏరియా దగ్గరలో ఓ ఇల్లు కడుతున్నాను అని చెప్పాను. వివాహం అయ్యాక ఇద్దరం కలిసి వేరేగా ఉండవచ్చు అని...అయితే ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆమె నా కుటుంబంతో పాటే ఉందామని ఖచ్చితంగా చెప్పింది అన్నారు రామ్ చరణ్. ఈ రోజు వివాహం చేసుకుంటున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ఆమె ఆ మాట అనటానకి సెల్ఫిష్ మోటివ్ వెనక దాగి ఉందని అన్నారు. అదేమిటంటే...నన్ను హ్యాండిల్ చేయాలంటే ఆమె ఒక్కర్తి సరిపోదని,నా కుటుంబం హెల్ప్ కావాలని ఆమె ఉద్దేశ్యం అన్నారు. అలా తన భార్య ఉపాసనను రామ్ చరణ్ సపోర్టు చేస్తూ మాట్లాడారు. తనకి,ఆమెకి ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటమే ఇష్టమనే భావనని వెల్లబుచ్చారు.
ఇక తాను తమ ఇంట్లో గారాల బిడ్డనని రామ్ చరణ్ అన్నారు. తన తండ్రి కోసం వచ్చే దర్శకులు,నిర్మాతలు తనను చిన్నతనం నుంచి గారం చేసారని అన్నారు. నేను మా ఇంటి వద్ద అయితే హ్యాపిగా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలనని అన్నారు. ఇక వివాహం అయ్యాక తాను మరింత బాలెన్సెడ్ గా ఉండగలను అన్నారు. నా ఎగస్ట్రా కరిక్యులర్ ఏక్టివిటిస్ అన్ని క్లోజ్ అయ్యిపోతాయి అన్నారు. నా ఫోకస్ మొత్తం పని మీద,కుటుంబం మీద ఉండేందుకు అవకాశం ఉంటుంది అన్నారు.
రామ్‌చరణ్‌ వివాహ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్‌ సి.రెడ్డి మనుమరాలు ఉపాసన మెడలో ఆయన గురువారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తాళి కడతారు. వీరి వివాహానికి హైదరాబాద్‌ నగర శివార్లలో ఉపాసన కుటుంబీలకు ఉన్న వ్యవసాయ క్షేత్రం వేదికైంది. ప్రతాప్‌ సి.రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలోని సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వివాహ ఏర్పాట్లను చేశారు. ఆ ప్రాంగణంలో సుమారు 5 వేల మంది అతిథులు ఆసీనులయ్యే వీలుంది.