11 జూన్, 2012

‘జులాయి’ హీరోయిన్‌పై కస్సుమన్న దాసరి

                     Dasari Targets Ileana

దర్శకరత్న దాసరి నారాయణరావు గతంలో పలు సందర్భాల్లో హీరోయిన్లపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వీళ్లు డబ్బులిస్తే షాపుల ఓపెనింగులకు వస్తారు కానీ....వీరికి మన అవార్డులన్నా, మన సినిమాలన్నా గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దాసరి మరోసారి హీరోయిన్ల తీరుపై కస్సుమన్నారు.
‘జులాయి' ఆడియో వేడుకకు ఆ చిత్రంలో నటించిన ఇలియానా హాజరు కాక పోవడంపై దాసరి మండిపడ్డారు. ఇప్పటికైనా హీరోయిన్లు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. దాసరి ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు కాబట్టి అంతా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
జులాయి ఆడియోకు దాసరి నారాయణరావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై పాటల సీడీని విడుదల చేశారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసిసిలో ఆదివారం సాయంత్రం ఈ వేడక జరిగింది. కాగా జులాయి మూవీ ఏపీ థియేట్రికల్ రైట్స్ దాసరికి సంబంధించిన ‘సిరి మీడియా' భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియాన నటిస్తోంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత: రాధాకృష్ణ, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పకులు: డి వివి దానయ్య.