29 జూన్, 2012

హాట్ న్యూస్:సిక్స్ ప్యాక్ విషయమై తేల్చిన మహేష్
మహేష్ బాబు సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు..రాబోయే సుకుమార్ చిత్రంలో చొక్కా విప్పి తన శరీరాన్ని చూపుతూ ఫైట్ చేయనున్నారు. అందుకోసం ఆయన హాలీవుడ్ నుంచి ట్రైనర్ ని రప్పించుకుని ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటూ గత కొంత కాలంగా కంటిన్యూగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎట్టకేలకు మహేష్ బాబు పెదవి విప్పి మీడియాకు సమాధానమిచ్చి అనుమానులను క్లారిఫై చేసారు. ఆయన అభిమానులను సంతోష పెట్టారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో ఉన్న మహేష్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ...నేను ఏ సినిమాలనూ షర్ట్ లెస్ గా కనిపించదలుచుకోలేదు. నేను ఫిటినెస్ ట్రైనర్ జార్జీతో పనిచేస్తున్న మాట నిజమే. అయితే అది నా హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి, నా ఫిటెనెస్ లెవిల్స్ మరింత మెరుగుగా చేసుకోవటానికి మాత్రమే అని తేల్చి చెప్పారు. ఇక జార్జీ గతంలో బ్రాడ్ పిట్, డెమీ మూర్,టోబీ మోగూర్ వంటివారికి ఫిటెనెస్ ట్రైనర్ గా పనిచేసారు.

వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...విరగబూసిన సిరిమల్లె చెట్టుని ఆ పూట సీతమ్మకి అంకితం చేశారు. కొమ్మ కదలకుండా పూలు కోశారు. కోసిన పూలన్నీ వాలుజడకి చుట్టారు. సీతమ్మ సింగారం వెనక అసలు కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు దిల్‌ రాజు.

అలాగే తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదమ్ములుగా ఇద్దరు కథానాయకులు ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది. ఇంటర్నెట్‌లో ఆ పాట బిట్‌ చాలామంది వీక్షిస్తున్నారు అన్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. 

వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.