29 జూన్, 2012

శేఖర్ కమ్ములకు ప్రభాస్ రిలీజ్ ట్విస్ట్మెల్లిగా కూల్ ఫిల్మ్స్ చేసుకుంటూ వస్తున్న దర్శకుడు శేఖర్ కమ్మల ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఆయన తన తాజా చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ని ఆగస్టు 15న విడుదల చేద్దామనుకుంటున్నారు. అయితే అదే రోజున ప్రభాస్ తన చిత్రం రెబెల్ ని విడుదల చేయాటనికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. దాంతో ఈ రెండు రిలీజ్ డేట్స్ మధ్యన క్లాష్ నెలకొని ఉంది. సంక్రాంతికి వద్దామనుకుని రాలేక ఇప్పటికే లేటైన శేఖర్ సినిమాకు ఇది ఊహించని విషయమే.

మరో ప్రక్క ప్రభాస్ రెబెల్ సైతం ఇప్పటికే చాలా లేటైంది. చాలా కాలం క్రితం ఈ సినిమా ప్రారంభమైనా ఇప్పటికి ఈ చిత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దర్శకుడు లారెన్స్ ఆ చిత్రాన్ని శిల్పం చెక్కినట్లు మెల్లిగా చెక్కుతున్నాడు. దానికితోడు ఈ సినిమాకు సంగీతం సైతం తానే ఇస్తానని ముందుకు వచ్చి మరీ లేటు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ప్రభాస్ సినిమాలు ఈ మధ్యన విడుదల కాక గ్యాప్ వచ్చేసింది. మళ్లీ రిలీజ్ డేట్ మార్చాలంటే కుదరని పరిస్ధితి. అలాగని ఈ రెండు సినిమాలు ఒకే రోజు వేస్తే ధియోటర్స్ సమస్య వస్తుంది. అందరూ హీరో కాబట్టి ప్రభాస్ సినిమావైపుకే మొగ్గు చూపెడతారనేది నిజం.

అయితే లారెన్స్ మాత్రం ఈ చిత్రం గురించి మీడియాలో ఊదరకొడుతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు లారెన్స్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు.

అలాగే ప్రభాస్‌ శైలికి సరిపోయే చిత్రమిది.‘రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ‘రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ‘ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా ‘రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది అన్నారు.

తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. వేసవిలో 'రెబల్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రభాస్ కెరీర్‌లోనే ‘రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది.షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరిందని నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.