12 జూన్, 2012

నన్ను తీసేసింది అందుకు కాదు: సమంత

                                    Why Samantha Of Mani Ratnam S Film


మణిరత్నం తాజా చిత్రం ‘కడల్'నుంచి సమంతని తొలిగించిన సంగతి తెలిసిందే. ఆమెపై కొన్ని కీ సీన్స్ షూట్ చేసాక ఆమెను చిత్రం నుంచి తొలిగించారు. హీరో కన్నా ఆమె పెద్దదిగా కనిపిస్తోందనే ఉద్దేశంతో ఆమెకు బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే సమంత అదేమీ నిజం కాదని,తను ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు రావటానికి కారణం వేరే ఉందని మీడియాతో వద్ద ఖడించింది.
సమంత ఈ విషయమై మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నాను. దానివల్ల ఆ మధ్య అస్వస్థతకు గురయ్యాను. దాంతో నా షూటింగ్ షెడ్యూల్స్ కొంచెం అటూ ఇటూ అయ్యాయి. అందువల్ల మణి సార్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అది నా దురదృష్టం. మణి సార్ దర్శకత్వంలో షూటింగ్‌కి వెళ్లకుండానే వదులుకోవాల్సి వచ్చింది అని క్లారిఫై చేసింది.
ఈ చిత్రంలో హీరోగా కార్తీక్ కుమారుడు గౌతమ్ పరిచయం అవుతున్నాడు. అలాగే రాధ రెండో కుమార్తె(కార్తిక చెల్లెలు)తులసి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక ఆ చిత్రం టైటిల్ పేరు ‘కడల్'. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. కార్తీక్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది. ‘కడలి' టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. ఇక సఖి తర్వాత మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్‌ సూర్య' ' రామ్‌ చరణ్‌ ' ఎవడు' మణిరత్నం ' కాదల్‌' గౌతమ్‌ మీనన్‌ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.