11 జూన్, 2012

అర్థరాత్రి...పవన్, చరణ్‌లతో సల్మాన్ ములాఖత్!

                                      Salman Visits Chiranjeevi House Late Night


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆదివారం అర్ధరాత్రి దాటాక చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. చెర్రీ వివాహం నేపథ్యంలో రామ్ చరణ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సల్మాన్ హైదరాబాద్ వచ్చారు. ఆయనతో పాటు జంజీర్ దర్శకుడు, మరికొందరు యూనిట్ సభ్యులు హాజరయ్యారు. చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి సల్మాన్‌ను సాధరంగా రిసీవ్ చేసుకున్నారు.
ఆదివారం రాత్రి జులాయి ఆడియో వేడుక ముగియగానే...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుతో కలిసి చిరు నివాసానికి చేరుకున్నారు. పవన్‌ని చూడగానే ఎంతో ఎగ్జైట్ అయిన సల్మాన్ అతన్ని కౌగిలించుకుని ‘గబ్బర్ సింగ్' సక్సెస్ పై విష్ చేసినట్లు తెలిసింది. కొంత సేపు ఇద్దరూ సినిమా విషయాలపై మాట్లాడుకున్నారు.
అనంతరం సల్మాన్, జంజీర్ టీంకు చరణ్ గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఈ నెల 14న చెర్రీ పెళ్లి వేడుక ముగిసే వరకు సల్మాన్ ఇక్కడే ఉండనున్నారు. ఇందు కోసం వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.
చరణ్ ప్రస్తుతం పెళ్లి పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈనెల 14 ఉదయం ఉపాసనకు సంబంధించిన ఫాం హౌజ్‌లో చెర్రీ, ఉపాసన పెళ్లి వేడుక జరుగబోతోంది. ఈ వివాహ మహోత్సవానికి ఢిల్లీస్థాయి రాజకీయ నేతలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.