28 జూన్, 2012

మహేష్ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్
మహేష్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కనిపిస్తే ఎలా ఉంటుంది... త్వరలో ఆ సంఘటన నిజమయ్యే అవకాశముంది అంటున్నారు సినీ వర్గాలు. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ సాంగ్ కి డాన్స్ చేయనున్నాడని వినికిడి. ఈ మేరకు అల్లు అర్జున్ ని సంప్రదించారని చెప్తున్నారు. ఓ బాలీవు్డ్ స్టార్ హీరోయిన్ తో అల్లు అర్జున్ కి జోడీ కట్టించి స్టెప్స్ వేయించాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో మల్టి స్టారర్ వైపు మెల్లిగా స్టార్ మొగ్గు చూపుతున్నారు. వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మొదలైంది. అలాగే అల్లు అర్జున్ గెస్ట్ గా కనిపించే ఎవడు చిత్రం షూటింగ్ కూడా కంటిన్యూగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రంలో రామ్ చరణ్ ఉన్నారు. రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్ ఒప్పుకున్నారు. అలాగే సుకుమార్ తో అల్లు అర్జున్ కి ఉన్న రాపోతో ఈ సాంగ్ కి ఓకే అనే అవకాశముందని సమాచారం.

మహేష్‌తో ‘దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌ బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్‌ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అవి నిజం కావని కొట్టిపారేసాను మహేష్ బాబు. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే జులాయి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.