13 జూన్, 2012

అందులో నా ప్రమేయం లేదు

                                                      

తమిళనాట హన్సికను ఇష్టపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకే సినిమా పోస్టర్ పబ్లిసిటీల్లో కూడా హీరోతో సమానమైన ప్రాధాన్యతను తమిళ నిర్మాతలు హన్సికకు ఇచ్చేస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదలైన ‘ఒరు కాల్ ఒరు కన్నాడీ’ చిత్రం పోస్టర్లలో హీరో, నిర్మాత అయిన ఉదయ్‌నిధి స్టాలెన్ తనతో సమానంగా హన్సిక స్టిల్స్ వేయించారు. హన్సిక కారణంగానే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని సినీ పండితులు విశ్లేషించారు కూడా.

ప్రస్తుతం ఆర్యతో ఓ సినిమా, శింబుతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు హన్సిక. ఈ సినిమాల విషయంలో కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వాలని సదరు నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ విషయం గురించి హన్సికను అడిగితే- ‘‘హీరోతో సమానమైన ప్రాధాన్యత కావాలని నేను కోరుకోను. పబ్లిసిటీ వ్యవహారం నా ప్రమేయం లేకుండా జరిగేదే. నా పాత్ర విషయంలో మాత్రమే నేను జాగ్రత్త పడతాను.

మిగిలిన విషయాలు నాకు అనవసరం. ‘ఒరు కాల్ ఒరు కన్నాడీ’ పబ్లిసిటీల్లో నాకు తగు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరో కాదు... ఆ సినిమా హీరోనే. ఈ సందర్భంగా తనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం నేను మూడు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి తెలుగు సినిమా అయితే, రెండు తమిళ సినిమాలు. మూడింటిలోనే మంచి పాత్రలే చేస్తున్నాను’’ అని చెప్పారు హన్సిక.