29 జూన్, 2012

ఆమె పెద్ద.... అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడటమే అరుదు. ఆయన ఎవరినైనా పొగిడారంటే అదో గొప్ప విషయం. తాజాగా ‘గబ్బర్ సింగ్' హీరోయిన్‌ శృతి హాసన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్. ఓ ప్రముఖ దిన పత్రికతో ఆయన మాట్లాడుతూ...శృతి హాసన్ చాలా హార్డ్ వర్క్, ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు అంటూ కొనియాడారు. భవిష్యత్‌లో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు పవన్.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈచిత్రం రేపు(జూన్ 29) 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఇప్పడు అందరి కళ్లు ఈచిత్రం 50 రోజుల సందర్భంగా ఏలాంటి రికార్డు సృష్టిస్తుందో అని...50 రోజులు ప్రదర్శితమైన థియేటర్ల పరంగా ఈచిత్రం తప్పకుండా నెం.1 రికార్డు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జాట్ థియేటర్ల పిగర్ రేపు వెల్లడి కానుంది.

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్