30 జూన్, 2012

ఆగస్టులో బాలకృష్ణ ఫ్యాన్స్ కు పండగ


బాలకృష్ణ తాజా చిత్రం ‘శ్రీమన్నారాయణ' ఓవర్ సీస్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ రెడీ అవుతోంది. ఈ చిత్రం ఆడియోను జూలై నెలాఖరున చేసి,రిలీజ్ ని ఆగస్టు రెండో వారంలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రబాస్ చిత్రం రెబెల్ కు క్లాష్ కాకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. రెబెల్ కూడా ఆగస్టులోనే విడుదల కానుంది. ఆగస్టు 15న రిలీజ్ ఉండవచ్చుని వినిపిస్తోంది.

ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై బాలకృష్ణ కథానాయకుడిగా రవికుమార్ చావలి దర్శకత్వంలో ‘మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... ‘మలేషియాలో తీసిన ఫైట్, సాంగ్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ఈ షెడ్యూల్‌లో చేసిన వర్క్ ‘శ్రీమన్నారాయణ'కు హైలెట్‌ అవుతుంది. బాలకృష్ణతో శ్రీమన్నారాయణ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు అభిమానులు బాలయ్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు ‘శ్రీమన్నారాయణ'లో ఉంటాయి అన్నారు.

బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.