28 జూన్, 2012

అల్లు అర్జున్ 'జులాయి'కి సడెన్ షాక్అల్లు అర్జున్ తాజా చిత్రం జులాయిని రాజమౌళి ఈగ కోసం విడుదలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జూలై 13న ఈ చిత్రం విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా అదే రోజున అజిత్ భారీ చిత్రం డేవిడ్ బిల్లా కూడా రిలీజ్ కానుంది. జులాయికి ఈ డబ్బింగ్ చిత్రం పోటీ కాకపోయినా అజిత్ లాంటి స్టార్ చిత్రం తప్పకుండా భాక్సాఫీస్ వద్ద పోటీ ఇస్తుందంటున్నారు. ముఖ్యంగా థియేటర్స్ విషయంలో ఇబ్బంది ఎదురౌతుందని అంచనాలు వేస్తున్నారు.

అజిత్ తాజా చిత్రం ‘డేవిడ్ బిల్లా' రిలీజ్ డేట్ ని ఎట్టకేలకు ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని జూలై 13న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కింగ్ ఆఫ్ ఓపినింగ్స్ గా పేరుతెచ్చుకున్న అజిత్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని తమిళనాడులోనే దాదాపు 500 స్క్రీన్స్ పై గా రిలీజ్ చేస్తున్నారు. శకుని విడుదల అయిన మూడు వారాల తర్వాత ఈ చిత్రం విడుదల చేయాలని ఎగ్రిమెంట్ ప్రకారం మొదట అనుకున్న రిలీజ్ డేట్ ని కాదని దీన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం తెలుగులోకి డబ్ ఇక్కడ కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఈ చిత్రం సీక్వెల్ కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రం కథ... బిల్లా మాఫియా లీడర్ అవ్వకముందు ఏం చేసేవాడు? అతను మాఫియాలోకి ఎంటరవ్వడానికి కారణం ఏంటి? అసలు బిల్లాగా అతను ఎలా రూపొందాడు. అంత పరవ్ శక్తిగా ఎలా మారి ప్రపంచానికి సవాళ్లు విసిరాడు... వంటి అనేక విషయాలు ఈ చిత్రంలో చర్చకు రానున్నాయి. ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్ లో రానుందని తెలుస్తోంది.

''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని'' అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే... జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. 

అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.