13 జూన్, 2012

రామ్ చరణ్ పెళ్లికి బాలకృష్ణ గైర్హాజరు?

                                 Balakrishna Miss Charan Wedding
.

రామ్ చరణ్ తేజ్, ఉపాసన కామినేని వివాహం జూన్ 14న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడకకు సినీ, రాజకీయ ప్రముఖలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ నేపధ్యంలోనందమూరి బాలకృష్ణ ఈ వివాహానికి హాజరు కారా అన్న సందేహం అందరికీ కలుగుతోంది. దానికి కారణం ఆయన ఊళ్లో ఉండకపోవటమే. శ్రీమన్నారాయణ షూటింగ్ నిమిత్రం స్విజ్జర్ లాండ్ వెళ్లారు. అక్కడ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే వివాహ సమయానికి వచ్చే అవాకాశం ఉంది అని కొందరంటున్నారు. షూటింగ్ బ్రేక్ చేసుకుని ఒక్కరే వచ్చి వెళ్లిపోతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు మెగా కుటుంబీకులు. ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఈ వివాహ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి నిమిత్తం రామ్ చరణ్ ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పెళ్లికి ముందు రెండు వారాల...పెళ్లి తర్వాత మరో రెండు వారాలు చెర్రీ పూర్తిగా షూటింగులను దూరంగా ఉండి పెళ్లి సంబరంలో మునిగి తేలనున్నాడు. జూన్ 14న వ తేదీన ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వివాహం జరుగనుంది.

చరణ్-ఉపాసన వివాహం మోయినాబాద్‌ ప్రాంతంలో ఉన్న ఉపాసన ఫాంహౌస్‌లో జరుగబోతోంది. పెళ్లికి కేవలం చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఎంపిక చేయబడ్డ సినీ, రాజకీయ ప్రముఖులు, వివిఐపిలకు మాత్రమే ప్రవేశం ఉంది. ఎంట్రీ కోసం ఎలక్ట్రానిక్ పాస్‌లను ప్రవేశ పెట్టారు. సాధారణ జనాలకు, అభిమానులకు ఈ వేడుకలో చోటు లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మోయినాబాద్‌లోని ఉపాసన కుటుంబీకులకు సంబంధించిన ఫాం హౌస్‌లో పెళ్లి వేడుక నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల బంధుమిత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులకు మాత్రమే ప్రవేశం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఎంట్రన్స్ కార్డులను తయారు చేయించారు. అభిమానుల కోసం పెళ్లి తర్వాత రోజు హైదరాబాద్‌లో భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చెర్రీ, ఉపాసనతో పాటు మెగా కుటుంబానికి చెందిన హీరోలంతా హాజరు కానున్నారు. ఇక చెర్రీ, ఉపాసన కుటుంబ సభ్యులు ఈ వేడుక కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.