13 జూన్, 2012

మేమిద్దరం త్రిపాత్రాభినయం చేశాం

  
‘‘నా కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయే సినిమా ‘తేరీ మేరీ కహానీ’. ఇందులో తొలిసారి మూడు పాత్రలు చేసే అవకాశం దక్కింది నాకు. నటిగా నా ఆకలి తీర్చిన సినిమా ఇది’’ అంటున్నారు బాలీవుడ్ భామ ప్రియాంకచోప్రా. షాహిద్‌కపూర్‌తో ఆమె నటించిన ‘తేరీ మేరీ కహానీ’ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రియాంక పై విధంగా స్పందించారు.
                                          
ఇంకా చెబుతూ -‘‘విచిత్రమైన కథ, కథనాలతో ఈ సినిమా సాగుతుంది. 1910లో కొంతభాగం కథ నడుస్తుంది. ఆ టైమ్‌లో నా పాత్ర పేరు ఆరాధన. తర్వాత 1960లో కొంత కథ ఉంటుంది. ఆ టైమ్‌లో వచ్చే నా కేరక్టర్ పేరు రుక్సార్. ఇక 2012లో నేటి మహిళకు ప్రతీకలా కనిపిస్తాను. ఆ పాత్ర పేరు రాధ. మూడూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రలు. ఎంతో ఎంజాయ్‌చేస్తూ చేసిన సినిమా ఇది.

నేను ప్రేమించి చేసిన సినిమా ‘ఫ్యాషన్’ అయితే, నేను ఆరాధించి చేసిన సినిమా ‘తేరీ మేరీ కహానీ’. ఇందులో షాహిద్ కూడా మూడు పాత్రలు చేశాడు. తనకు కూడా మంచి పేరు తెచ్చిపెడుతుందీ సినిమా. కొత్తపంథాలో జనరంజకంగా దర్శకుడు కునాల్ కొహ్లీ సినిమాను మలిచాడు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ఫలితం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు ప్రియాంక.