30 జూన్, 2012

హర్రర్ సినిమా హీరోయిన్ తో నాగ్ రొమాన్స్
విక్రమ్ భట్ రూపొందించిన హర్రర్ చిత్రం "1920" లో హీరోయిన్ గా చేసిన ఆద్ శర్మ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆమెను నాగార్జున తాజా చిత్రం భాయ్ లో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఆమెకు ట్రైల్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయని హీరోయిన్ గా ఎన్నుకున్నారు. ఆద శర్మను సెకండ్ హీరోయిన్ గా తీసుకునే అవకాశముందని సమాచారం.
పూలరంగడు చిత్రంతో హిట్ ని సొంతం చేసుకున్న దర్శకుడు వీరభద్ర చౌదరి ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో సంస్థ నిర్మించనుంది. హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ పేరును పరిశీలిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం మొదలు కానున్నట్లు సమాచారం.

నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన ‘షిరిడి సాయి' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.ఇంతకు ముందు భక్తుడిగా అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన నాగ్, షిరిడి సాయి చిత్రంలో తొలిసారి దేవుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే తన తండ్రి నాగేశ్వరరావు,తన కుమారుడు నాగచైతన్యలతో కలిసి త్రయం అనే చిత్రం చేస్తున్నారు. ఇష్క్ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. మరో ప్రక్క దశరధ్ దర్సకత్వంలో నాగార్జున హీరోగా చేస్తున్న లవ్ స్టోరీ చిత్రం షూటింగ్ మొదలైంది.

ఇక నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'పై బాగా నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ''నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా గ్రాఫిక్స్‌ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నాము''అని ధర్శకుడు తెలిపారు.

ఇక గత ఆరు నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ చిత్రం జూలై మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశముందని నాగార్జున తెలిపారు. అయితే గ్రాఫిక్స్ లేటవటంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.