12 జూన్, 2012

నాగార్జున సినిమాపై సూపర్ స్టార్ కన్ను...?

                                  Shahrukh Khan Interested Damarukam


నాగార్జున నటిస్తున్న ‘డమరుకం' హిందీ రీమేక్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ సినిమా విషయమై ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై ఓ స్పష్టత రానుంది. విభిన్నమైన సినిమాలను తీయాలనే ఆలోచనలో ఉన్న షారుఖ్.... తెలుగు సినీ పరిశ్రమలో రూపొందుతున్న సినిమాలపై దృష్టి మళ్లించాడు. ఈ మధ్య తెలుగు సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అయిన భారీ విజయం సాధిస్తున్న నేపథ్యంలో షారుఖ్ కన్ను తెలుగు సినిమాలపై పడింది.
కింగ్ నాగార్జున హీరోగా కె. అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డా. వెంకట్ నిర్మిస్తున్న ‘డమరుకం' చిత్రం జూలై రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈచిత్రానికి బయ్యర్లను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు నిర్మాతలు. నాగార్జున కెరీర్లోనే మొదటి సారి ఇలాంటి ఫాంటసీ మూవీ చేస్తున్నారు. హై టెక్నికల్ వేల్యూస్‌తో....ఆయన సినీ కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ ఇది.
నాగార్జున కెరీర్లోనే ఈచిత్రం భారీ బడ్జెట్‌తో దాదాపు రూ. 40 కోట్లు ఖర్చు పెట్టి భారీ గ్రాఫిక్స్ కలగలిపిన సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందించారు. అసలు తెలుగు సినిమా రేంజికే ఇది భారీ బడ్జెట్. వాస్తవానికి నాగార్జునకు రూ. 20 కోట్లకు మించిన మార్కెట్ లేదని, అలాంటి పరిస్థిత్లుల్లో అంతకు రెండింతలు ఖర్చు పెట్టి తీయడం ఏమిటని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కొందరు ముందుకు వచ్చినా...నిర్మాతలు చెబుతున్న రేటు చెల్లించి దక్కించుకోవడానికి వారు సిద్ధంగా లేరు. దీంతో తమ సినిమాను తాను చెప్పిన రేటుకు కొనే బయ్యర్ల కోసం ఎదరు చూస్తున్నారు నిర్మాతలు. మరి ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి నిర్మాతలు ఎలా బయట పడతారో చూడాలి.
నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజా శ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: చోటాకె నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: వెంకట్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.