11 జూన్, 2012

రామ్ చరణ్‌కు సారీ చెప్పి రాణా...!

                              Rana Say Sorry Charan


హీరో రాణా తన క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ తేజ్‌కు సారీ చెప్పారు. ఇది మామూల సారీ కాదు...పెద్ద సారీ. ఇందుక ప్రత్యేక మైన కారణం కూడా ఉందండోయ్. క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి పెళ్లికి కనీసం వారం రోజుల ముందునుంచైనా వచ్చి పెళ్లి వేడుకల్లో పాలుపంచుకోక పోవడమే. ఇందుకు ట్విట్టర్ ద్వారా అపాలజీ ఇస్తూ...సారీ చెప్పాడు.
కృష్ణం వందే జగద్దురుమ్ చిత్రంలో షూటింగులో బిజీగా ఉండటం వల్లనే రాలేక పోయానని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత్ కార్యక్రమానికి హాజరైన ఆ ఈ వెంట్‌లో పాటిస్పేట్ చేస్తానని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది చెర్రీ, రాణా మధ్య ఎంత గాఢమైన స్నేహం ఉందో...
" A big big sorry to @Alwayscharan for not being there for the earlier events. Will be in full form for the next!! Been missing all of @Alwayscharan's weeding celebrations!! Came straight from set after a 2am packup to his place!!" "Took off tomorrow form shoot for @Alwayscharan's sangeet!! Doing another little skit like I did for Bunny's. Excited and extremely happy for him" అంటూ రాణా ట్వీట్ చేశాడు.
రాణా నటిస్తున్న కృష్ణం వందే జగద్దురుమ్ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులోలో రాణా ఓ డిఫెరెంట్ మాస్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ఈ చిత్రం లో తన క్యారెక్టర్ గురించి హీరో రాణా గతంలో మాట్లాడుతూ...నా పేరు బాబు. చదువు బీటెక్‌. ఈ మాత్రం చదువుకొంటే చాలు... ఓ మంచి ఉద్యోగం సంపాదించేసి, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకొంటారు. కానీ బాబు అలా కాదు. ఏసీ గదుల్లో కూర్చుంటూ నెలకు వచ్చే నాలుగంకెల జీతంతో సంతృప్తి పడలేదు. అతని లక్ష్యం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు రాణా.
దర్శకుడు సినిమా విషయాల గురించి చెబుతూ...'గమ్యం'లోని గాలి శీను, 'వేదం' సినిమాలోని కేబుల్‌రాజు వీరిద్దరికన్నా మా బీటెక్‌ బాబు మహా మాస్‌ అని చెప్పారు. ఈచిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు.