28 జూన్, 2012

'కెమెరామేన్ గంగతో..'లో పవన్ డైలాగులు కొన్ని...
పెద్ద స్టార్ చిత్రం ప్రారంభమయ్యిందంటే ముందుగా హంగామా ప్రారంభమయ్యేది అభిమానుల నుంచే. రీసెంట్ గా ఆ అబిమానులు తమ హీరో నోటి వెంట ఏ డైలాగులు చెపితే బాగుంటాయో ఊహించి నెట్ లో ఉంచుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు లీక్ అంటూ కొన్ని డైలాగులు హల్ చల్ చేస్తున్నాయి. అవి పూరీ నిజంగా తమ చిత్రం కోసం రాసాడా లేదా అన్నది ప్రక్కన పెడితే వాటిలో ఎంతో కొంత సృజన ఉందనేది నిజం.

ఆ డైలాగులు కొన్ని...

గూండాలకి,గుడుంబ కాసేవాళ్లకి భయపడటానికి నేను పోలీస్ ని కాదూ, పొలిటికల్ లీడర్ ని కాదూ..ప్రెస్ ప్రెస్
ఒరేయ్ నిన్ను కొట్టాలని ఫిక్స్ అయ్యానురా..వెళ్లి మనుష్యులను తెచ్చుకో
వీడు మంచోడ,చెడ్డోడా, తిక్కోడా అని తెలుసుకోవటానికి ట్రై చేయకు...నీ గుండె కి,బ్రైన్ కి కనెక్షన్ కట్ అయ్యిపోద్ది..
విలన్ గట్టిగా అరుస్తుంటే....రాంబాబు(పవన్)ఇలా అంటాడు : చుప్‌బే సాలే, రాముడిని తలుచుకో పుణ్యం వస్తుంది....కానీ రాంబాబుని తలుచుకోకు నీ చావు కబురు బ్రేకింగ్ న్యూస్‌గా వస్తుంది.
పవన్ రౌడీతో : ఈ రాంబాబు తెలిసింది రెండే...ఒకటి న్యూస్ బ్రేక్ చేయడం, రెండు నీ బోన్స్ బ్రేక్ చేయడం
నేను క్యాజువల్‌గా కొట్టాను కాబట్టి క్యాజువాలిటీలోనైనా ఉన్నారు...అదే కసిగా కొట్టి ఉంటే కాటికి పోయేవారు
రాంబాబు బ్యాండ్ వేయడం స్టార్ట్ చేస్తే...బాడీ మొత్తం బ్యాండేజీలతో నిండి పోతుంది
రాంగ్ టైంలో రాంబాబును కెలికావ్ రా...ఇకనీ బాబు వచ్చినా నీ చావుని ఆపలేరు

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. పూరీజగన్నాథ్ ఈ చిత్రం గురించి చెబుతూ.... పవన్ తాను కలిసి చేసిన ‘బద్రి' తర్వాత మళ్లీ ఓ చిత్రం చేయాలని అనేకసార్లు ప్రయత్నించినా కుదరలేదని, తన 25వ చిత్రంగా మళ్లీ పవన్‌తో చేయడం ఆనందంగా వుందని తెలిపారు.

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం నిమిత్రం సారధీ స్టూడియోలో భారి సెట్ వేస్తున్నారు. సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.

అక్టోబర్ 18న విడుదల చేయనున్న ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలు వుండే డిఫరెంట్ యాక్షన్ చిత్రం ఇదని ఆయన వివరించారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్