29 జూన్, 2012

'గబ్బర్ సింగ్' అంత్యాక్షరి వివాదంపై గణేష్ బాబు
గబ్బర్ సింగ్ ‘అంత్యాక్షరి'సీన్ లోని పాటలకు ఆ పాటల మూల రచయితలకు రెమ్యునేషన్ అడుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ అయిన ఈ పాట విషయమై ఎపి సినీ రైటర్స్ అశోశియేషన్ ద్వారా చర్చలు జరుగుతన్నట్లు సమాచారం. ఇక తమ పాటలను వాడుకున్నందుకుగాను ఆయా పాటల రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు కాపీరైట్ యాక్ట్ ద్వారా తమ వాటా కోరేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. దాదాపు వంద కోట్ల వసూలు చేసిన ఈ చిత్రంలో 14 శాతం డిమాండ్ చేస్తున్నారని వినికిడి. అయితే నిర్మాత బండ్ల గణేష్ మాత్రం ఈ విషాయలేమీ తనకు తెలియదని అంటున్నారు.

మీడియావారు నిర్మాత బండ్ల గణేష్ దగ్గర ఈ విషయం ప్రస్దావించినప్పుడు ...నేను ఏ విధమైన లెటర్ ఎవరి నుంచీ అందుకోలేదు. అది ఖచ్చితంగా పే చెయ్యాలని కూడా నేను బావించటం లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ఇక బాగా పాపులర్ అయిన ఈ సీన్ సినిమాలో దాదాపు పావుగంట పాటు సాగుతుంది. ఈ సీన్ కోసం చాలా సినిమాల్లోని సాంగులను ఉపయోగించారు.

ఇక ఈ కాపీ రైట్స్ ఇష్యూ మీద సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ..మేమంతా కూర్చుని డిస్కస్ చేసి మా డ్యూస్ ఏమన్నా ఉన్నాయేమో సెటిల్ చేసుకోవాలి అన్నారు. మరో ప్రక్క ఇరవై ఏళ్ల క్రితం 'గ్యాంగ్ లీడర్' సినిమాలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన 'వానా వానా వెల్లువాయే' పాటను తాజాగా రామ్ చరణ్ తన 'రచ్చ' సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ లో సింహ భాగం ఈ పాట ఆక్రమించింది అని దర్శక,నిర్మాతలు సైతం ఒప్పుకున్నారు. అయితే ఈ పాట మూల రచయిత భువనచంద్రకు రెమ్యునేషన్ ఇవ్వలేదు. దాంతో ఆయనకు రెమ్యునేషన్ ఇవ్వాలని నోటీస్ ఇవ్వటం జరిగింది.

రైటర్స్ అశోశియేషన్ వారు నిర్మాత ప్రసాద్ కు లిరికిస్ట్ భువనచంద్రకు ఈ పాట నిమిత్తం పే చెయ్యమని నోటీస్ సర్వ్ చేసారు. అయితే నిర్మాతలు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు. సాధారణంగా ఓ పాటని రీమిక్స్ చేస్తున్నప్పుడు ఆ పాట మూల రచయిత సాహిత్యాన్ని వాడుకున్నట్లయితే,అనుమతి తీసుకోవటమే కాకుండా తగిన రెమ్యునేషన్ ఇవ్వటం అనేది చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఆడియో కంపెనీ నుంచి రైట్స్ తీసుకుని పాట రీమిక్స్ చేసామని నిర్మాత చెప్పటం విశేషం.