11 జూన్, 2012

"జులాయి" ఇలియానాకు పొగరు... "మెగా" లేడీ తమన్నా బెటరు

                   Tamannah

జులాయి చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించిన ఇలియానా ఆడియో కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. కారణాలేమైతేనేం ఆమె ఫంక్షన్‌కు కట్ కొట్టేసింది. ఐతే మెగా డైరెక్టర్లయిన దాసరి, రాజమౌళి, శ్రీను వైట్లతోపాటు పెద్ద నిర్మాతలుగా పేరున్న డి.సురేష్, బండ్ల గణేష్ వంటివారు కూడా హాజరయ్యారు.

దీంతో ఇలియానా గౌర్హాజరీపై ఫంక్షన్లో చాలామంది చాటుమాటుగా తిట్ల వర్షం కురిపించారు. దాసరి నారాయణ రావు అయితే నేరుగా ఎటాక్ ఇచ్చారు. సినిమాలో కథానాయికగా నటించినవారు కూడా రాకపోతే ఎలా..? ఇలాంటి వారిని... అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. 

అందరినీ ఆశ్చర్యపరుస్తూ తమన్నా ఆడియో కార్యక్రమానికి హాజరైంది. ఫంక్షన్‌కు అట్రాక్షన్‌గా నిలిచింది. మెగా ఫ్యామిలీపై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఇలా చాటిచెప్పిందంటున్నారు. ఇదిలావుంటే నెక్ట్స్ పవన్ కల్యాణ్ సినిమాలో ఇలియానా హీరోయిన్ అనుకున్నారట. కానీ జులాయి సినిమా ఆడియోకు ఎగ్గొట్టిన తర్వాత తమన్నాను తీసుకుంటే బావుంటుందని పవర్‌స్టార్ నిర్ణయించుకున్నట్లు భోగట్టా. మొత్తానికి ఇలియానా పొగరు తమన్నాకు కలిసొచ్చినట్లు లేదూ....