13 జూన్, 2012

మహేష్ తోనూ బోయపాటికి అదే సమస్య!?

                             Boyapati Srinu Problem With Mahesh Babu


ఎన్టీఆర్ తో దమ్ము సినిమా చేయటానికి ముందు.. దర్శకుడు బోయపాటి శ్రీను దాదాపు పది కథలు పైగా చెప్పారు. ఆయన చెప్పిన కథ మొదట్లో ఏదీ ఎన్టీఆర్ కి నచ్చలేదు. అదే విషయం స్వయంగా బోయపాటి శ్రీను సైతం మీడియా ముందు దమ్ము రిలీజయ్యాక తెలియచేసారు. ఇప్పుడదే సమస్య మహేష్ నుంచి బోయపాటికి ఎదురు అవుతున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను చెప్పిన కథ మహేష్ కి నచ్చక మార్పులు తెలిపాడని తెలుస్తోంది.
అయితే చిత్రంగా మహేష్ కోసం వండిన కథ రామ్ చరణ్ కి నచ్చిందని సమాచారం. రామ్ చరణ్ తో ఈ కథతో ముందుకు వెళ్లిపోవటమా లేక మహేష్ చెప్పిన మార్పులుతో కథ తయారు చేయటమా అనే డైలమాలో మహేష్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో వినపడుతోంది. ఇక ఆ మధ్య బోయపాటి మీడియాతో మాట్లాడుతూ... తెలుగు పరిశ్రమలో నేను తెరమీద చూపించాల్సిన హీరోలు చాలా మంది ఉన్నారు. వారందరితో సినిమాలు తీయాలన్నదే నా అభిలాష. మంచి కథతో బాలకృష్ణగారితో కూడా సినిమా చేయాలని ఉంది అన్నారు.
అలాగే అన్నీ ఉంటేనే సినిమా. నేను 'బొమ్మరిల్లు' లాంటి సినిమా తీసినా అందులో కావాల్సిన చోట యాక్షన్ తప్పకుండా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు చుట్టూ ఎన్ని ఉన్నా మనసు చట్నీ మీదకు కూడా వెళ్తుంది కదా. యాక్షన్ అనేది చట్నీలాంటిది. అందుకే యాక్షన్ లేకుండా సినిమా తీయను అని చెప్పారు.
ఇక బోయపాటి శ్రీను.. ఎన్టీఆర్ తో చేసిన దమ్ము చిత్రం భాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ తేలకపోయింది. దమ్ము క్లైమాక్స్ వీక్ గా ఉండటంతో తేలిపోయింది. పూర్తి ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన దమ్ము సూపర్ హిట్ అవుతుందని బోయపాటి భావించారు. సింహాతో వచ్చిన క్రేజ్ కి తగినట్లే ఈ సినిమాకు ఓ రేంజిలో బిజినెస్ సైతం జరిగింది. అయితే సినిమా ఫలితం యావరేజ్ అయ్యింది. అప్పటికీ 'దమ్ము' విషయంలో ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేశాం. ఎన్టీఆర్ గెటప్ కోసం చాలా ప్రయోగాలు చేశాం అంటూ పబ్లిసిటీ చేసి నిలబెట్టే ప్రయత్నం చేసారు.