30 జూన్, 2012

పాప పుట్టిన విషయమై మహేష్ భార్య ఖండన
మహేష్, నమ్రత దంపతులకు ఆడపిల్ల పుట్టిందంటూ వచ్చిన వార్తలను మహేష్ భార్య కొట్టిపారేసారు. ఆమెను మీడియావారు ఈ విషయమై కలవగా ఆమె అటువంటిదేమీ లేదని అన్నారు. ఆగస్టులో బేబి పుట్టవచ్చని తేల్చి చెప్పారు. ఇక ఓ టీవి ఛానెల్ లో మహేష్ కు పాప పుట్టిందంటూ వార్తలు రావటంతో అది అందరూ పాలో అయ్యారు. నెట్ లో సైతం ఇది విస్తృతంగా ప్రచారం జరిగింది.

ఇక ప్రస్తుతం మహేష్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పూర్తిచేసే బిజీలో ఉన్నారు. వెంకటేష్ తో కలిసి చేస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరో ప్రక్క సుకుమార్ దర్సకత్వంలో మరో చిత్రం మొదలైంది. పాటతో ప్రారంభమైన ఈ చిత్రం ధ్రిల్లర్ అని తెలుస్తోంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్, వెంకటేష్, ప్రకాశ్ రాజ్, సమంత, అంజలిలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ఈ దసరాకి విడుదల కానుంది. మహేష్ బాబు అభిమాన కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.

ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ... అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.