12 జూన్, 2012

‘జులాయి’లో మరికొన్ని పంచ్ డైలాగులు

                            Trivikram Punch Dialogues From Julaiఅల్లు అర్జున్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం ‘జులాయి'. ఇలియానా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ఆడియో పోయిన ఆదివారం సాయింత్రం విడుదలైంది. ఆడియో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం డైలాగులు పరంగానూ మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. దానికి కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావటమే. ఈ చిత్రం ట్రైలర్స్ లో వదిలిన డైలాగలు నెట్ లో హల్ చెల్ చేస్తున్నాయి. అవేమిటంటే...
1."మనకి తెలిసిన పని ప్రీగా చెయ్యికూడదు....మనకి రాని పని ట్రై చేయకూడదు"(సోనూ సూద్)
2. మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు...కొడితే ఒక్క దెబ్బకు లైఫ్ మొత్తం సెటిల్ అయ్యిపోవాలి(అల్లు అర్జున్)
3.చెప్పాలి సార్...ఆప్ట్రాల్ సిగెరెట్ పాకెట్ పై తాగొద్దు పోతారు అని రాసి ఉంటుంది...నాలాంటి వాడు నన్ను గెలికద్దు ఛస్తారు అని చెప్పకపోతే ఎలా? (అల్లు అర్జున్)
4. మరీ వైలెంట్ గా ఉండొద్దు..పువ్వులను అమ్మాయిలని చూపించడర్రా(రాజేంద్రప్రసాద్)
5.భయం వేస్తోందని హర్రర్ సినిమా చూడటం ఆపేస్తామా అమ్మా...అదో బ్యాడ్ హ్యాబిట్...వీడు అంతే(ఎమ్మెస్ నారాయణ)
ఇలాంటి పంచ్ డైలాగులు సినిమాలో బోలెడు ఉన్నాయంటున్నారు.ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు.
జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.
''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.