14 జూన్, 2012

ఇక ప్రీగా హీరోయిన్స్ తో రొమాన్స్: రామ్ చరణ్


                         Now I Can Freely Romance Ram Charan
నేను ఇప్పుడు ప్రీగా ప్రియాంక చోప్రా,కాజల్ లతో ఏ విధమైన బెరకూ లేకుండా రొమాన్స్ చేయవచ్చు" అన్నారు రామ్ చరణ్ జోక్ చేస్తూ. అలాగే వివాహ సమయంలో నెర్వస్ గా ఉంటుందా అన్న విషయమై మాట్లాడుతూ... "అలాంటిదేం లేదు...ఉపాసనకి, నాకు మధ్య ఆ మూవ్ మెంట్స్ ఉన్నచనువుతో అలాంటిదేం లేదు..మేం చాలా కాలంగా ఒకరికిని ఒకరు ఎరుగుదుం.. మా వేవ్ లెంగ్త్ లు ఫెరఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి" అన్నారు. వివాహానికి ముందు రామ్ చరణ్ మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి.
"అలాగే ఉపాసన అందరి ఆడపిల్లలు లాగానే నేను హీరోయిన్స్ తో తెరపై చేసే రొమాన్స్ ని చూసింది. ఆమెకు ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవటంతో నార్మల్ గర్ల్ లా కొంత కంగారు పడింది. అప్పుడు నేను పరిస్దితిని ఎక్సప్లైన్ చేయటమే కాకుండా నా సెట్స్ కు కూడా తీసుకు వెళ్లి చూపించాను. ఆమె రచ్చ సెట్స్ కు వచ్చి అక్కడ జరిగే షూటింగ్ ని గమనించింది. ఆమె కళ్లతో చూసి నమ్మింది" అన్నారు.
రాంచరణ్‌, ఉపాసనల వివాహం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సమీపంలోని టెంపుల్‌ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాంచరణ్‌, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి అమితాబచ్చన్, రజనీకాంత్, శ్రీదేవి-బోణికపూర్, అంబరీష్, మోహన్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, డి.రామానాయుడు, దాసరి, వెంకటేష్, శ్రీకాంత్, బ్రహ్మానందం, మురళీమోహన్, సుమలత, టీఎస్సార్, బోయపాటి, రాణా, విష్ణు, ఆహుతీప్రసాద్, వేణుమాధవ్, ఉత్తేజ్, శ్రీనువైట్ల తదితరులు హాజరయ్యారు.
ఈ రోజు (గురువారం)సాయంత్రం హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో రామ్ చరణ్ పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు వేల మందికి ఆహ్వానాలు అందజేశారు. ఆయా కార్యక్రమాలకు ఆహ్వానించిన వారికి మించి ఇతరులు రాకుండా ఆహ్వానపత్రికలోనే ఒక స్వైప్ కార్డు పంపిణీ చేశారు. ఆ కార్డులున్న వారికి మాత్రమే లోపలికి ప్రవేశం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ లో ఘనంగా జరిగింది.
ఇక ఈ పెళ్లి సందర్భంగా చిరంజీవి కుటుంబ సినీ అభిమానులకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాగబాబు ఈ విందు విషయమై మాట్లాడుతూ.. పెళ్లి జరిగే ఫామ్ హౌస్‌లోనే ఈ నెల 15వ తేదీన అభిమానుల కోసం ప్రత్యేకవిందు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఈ విందుకు అందుబాటులో ఉన్న ఐదువేలమంది అభిమానులకు ఆహ్వానపత్రికలు అందచేశామని, ఆహ్వానాలు ఉన్నవారే ఆ కార్యక్రమానికి రావాలని కోరారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను ఫామ్‌హౌస్‌కు చేర్చేందుకు వివిధ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.
nd of AdsforIndians AdNetwork -->