11 జూన్, 2012

గుండమ్మగా మా అమ్మను ఓసారి ఊహించుకోండి...

                                              


‘‘‘గుండమ్మ కథ’లో గుండమ్మగా మా మమ్మీ సరిగ్గా సరిపోతుంది’’ అని దర్శక, నిర్మాతలకు ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు రాధ గారాలపట్టి కార్తీక. ఎన్టీఆర్, నాగచైతన్యలతో ‘గుండమ్మకథ’ తీస్తే బావుంటుందనీ, అయితే... గుండమ్మ పాత్రే పెద్ద సమస్యగా మారిందని పలువురు చిత్ర ప్రముఖులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ‘‘మా మమ్మీని ఓ సారి గుండమ్మగా ఊహించుకొని చూడండి’’ అంటూ వార్తల్లో నిలిచారు కార్తీక. 

రాధ ఒకవేళ గుండమ్మగా ఓకే అయితే... జమున పాత్రను తను కొట్టేయొచ్చు అనేది ఈ ముద్దుగుమ్మ ప్లాన్ అని కొందరు అంటున్నారు. ఈ విషయంపై కార్తీక స్పందిస్తూ -‘‘‘గుండమ్మ కథ’ నా ఫేవరెట్ మూవీ. ఆ సినిమా మళ్లీ తీస్తే చూడాలని నాకూ ఉంది. నేనేదో అందులో నటించాలనే ప్లాన్‌తో... అమ్మ పేరును సూచించలేదు. నిజంగా అమ్మ బావుంటుందనే చెబుతున్నాను. ఆ పాత్రను అమ్మ సమర్థవంతంగా పోషించగలదు. పైగా అమ్మకు ఉన్న స్టార్‌డమ్ వల్ల ఆ పాత్రకు మరింత బలం చేకూరుతుంది’’ అని చెప్పారు కార్తీక.