15 జూన్, 2012

ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్...

                                         Pawan Kalyan Visits Hospitalపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఆసుపత్రిలో ప్రత్యక్ష్య అయ్యారు. ఎల్.బి.నగర్‌లోని కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ‘గబ్బ్ సింగ్' నిర్మాత బండ్ల గణేష్‌ను పరామర్శించారు. గురువారం రాత్రి చరణ్ రిసెప్షన్ నుంచి పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఆసుపత్రికి వచ్చి నిర్మాతను పరామర్శించడం ఇదే తొలిసారి. పవన్-గణేష్ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఇదో నిదర్శనం అని చెప్పొచ్చు. ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గణేష్ శనివారం ఆసుపత్రి నుంచి డిచ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.
గణేష్ ఆ సుపత్రిలో చేరడానిని కారణం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సాగర్‌ హైవే వద్ద గణేష్ కి స్థానికులు దేహశుద్ధి చేయడమే. ఆగపల్లి హైవేపై బండ్ల గణేష్‌ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయలయ్యాయి.
ఇది గమనించి ఆగ్రహించిన బాధితుని బంధువులు, స్థానికులు గణేష్‌పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన గణేష్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. కారు ఢి కొనడంతో గాయపడ్డ వ్యక్తిని కూడా సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.