30 జూన్, 2012

రామ్ చరణ్ కి వినాయిక్ సెంటిమెంట్ కలిసొస్తుందా?
రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వినాయిక్ చెర్రీ అనే టైటిల్ ని పెట్టాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. చెర్రి అనేది రామ్ చరణ్ ముద్దు పేరు. గతంలోనూ అల్లు అర్జున్ ముద్దు పేరు అయిన బన్నిని సినిమాకి పెట్టి సూపర్ హిట్ కొట్టారు. దాంతో ఈ సారి అదే సెంటిమెంట్ తో అదే రూట్ లో వెళ్తున్నట్లుగా చెప్తున్నారు.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వాలైంటైన్స్ డే సందర్బంగా విడుదల చేసారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ క్రిందటి నెలలో వివాహానికి ముందు రెగ్యులర్ గా జరిగింది. అక్కడ రామ్ చరణ్ మీద ఫైట్ సీక్వెన్స్ లను చిత్రీకరించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాచో లుక్ తో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని వినాయిక్ చెప్తున్నారు.

ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో నిలబడిపోయే చిత్రమని అంటున్నారు. ఆకుల శివ కధ అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చే కుమారుడుగా కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ చిత్రం కాక జంజీర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రం షూటింగ్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. వినాయిక్.. అల్లు అర్జున్ తో చేసిన బద్రీనాధ్ తర్వాత రూపొందిస్తున్న చిత్రం ఇదే.