14 జూన్, 2012

రామ్ చరణ్ హనీమూన్ ట్రిప్ డిటేల్స్


                       Now I Can Freely Romance Ram Charan
రామ్ చరణ్, ఉపాసనల వివాహం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వివాహం ముగియటంతో అందరి దృష్టీ తదుపరి కార్యక్రమమైన హనీమూన్ ట్రిప్ పై పండింది. వివాహమే ఇంత గ్రాండ్ గా చేసారే.. ఇంక హనిమూన్ ఇంకెంత భారీ ట్రిప్స్ తో నిండి ఉంటుందో అని అందరిలో అంచనాలు మొదలయ్యాయి. అయితే వాటినన్నటికి భిన్నంగా రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు.
హనీమూన్ విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ..షాపింగ్ కి,ట్రాపిక్ కి దూరంగా ప్రాతంలో ట్రిప్ వేస్తాం. అదీ ఇండియాలోనే.. కేవలం నాలుగు రోజులు మాత్రమే అన్నారు. ఎందుకంటే ఆయన తిరిగివచ్చి ఎవడు షూటింగ్ లో పాల్గొనాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం తర్వాత వివి వినాయిక్ దర్శకత్వంలో ఆయన బిజీ అవుతారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సమీపంలోని టెంపుల్‌ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సమీపంలోని టెంపుల్‌ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గతంలో నిశ్చితార్థం కూడా ఇక్కడే జరిగింది. రామ్ చరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి అమితాబచ్చన్, రజనీకాంత్, శ్రీదేవి-బోణికపూర్, అంబరీష్, మోహన్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, డి.రామానాయుడు, దాసరి, వెంకటేష్, శ్రీకాంత్, బ్రహ్మానందం, మురళీమోహన్, సుమలత, టీఎస్సార్, బోయపాటి, రాణా, విష్ణు, ఆహుతీప్రసాద్, వేణుమాధవ్, ఉత్తేజ్, శ్రీనువైట్ల తదితరులు హాజరయ్యారు.