16 జూన్, 2012

లక్కీచాన్స్ కొట్టిన సమంత

                                              

ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలంటారు. నటి సమంతకు మాత్రం ఒక మంచి అవకాశం కోల్పోతే మరో లక్కీచాన్స్ చేతి కందింది. మణిరత్నం చిత్రం నుంచి వైదొలిగిన సమంత స్టార్ డెరైక్టర్ శంకర్ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించనున్న భారీ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి దర్శకుడు నటి సమంతను 180 రోజులు బల్క్ కాల్‌షీట్స్ కోరినట్లు తెలిసింది. 

ఈ అమ్మడు మాత్రం తక్కువ తిన్నదా? అందుకు కోటిం పావు పారితోషికం అడిగిందట. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం డిమాండ్‌చేసిన ఏకైక దక్షిణాది తార నయనతార ఒక్కరే. ఆమె పయ్యా చిత్రానికి కోటి 25 లక్షలు పారితోషికం డిమాండ్ చేశారు. అయినా ఆ చిత్రంలో ఆమె నటించలేదు. ఇక సమంత విషయానికొస్తే శంకర్ చిత్రం కోసం ఆమె మూడు ఇతర చిత్రాలను వదులుకోవడానికి సిద్ధం అయ్యిందట. దీంతో చిత్ర నిర్మాత కోటిం పావు కాకపోయినా సమంత సంతృప్తి పొందే పారితోషికాన్ని చెల్లించడానికి సమ్మతించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మాస్ ఓరియంటెడ్ చిత్రం జూలై 15 ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీనికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని, పిసి శ్రీరామ్ చాయాగ్రహణం అందించనున్నారు. ఈ చిత్రంలో హాస్య భూమికను సంతానం పోషించనున్నట్లు సమాచారం.