10 జూన్, 2012

జీవీ "రెడ్డిగారి మనవడు" చిత్రానికి దర్శకుడు వర్మనా?

                               
రాయలసీమకు చెందిన నటుడు, దర్శకుడు జీవీ తాజాగా నిర్మాతగా మారాడు. వై.ఎస్‌. జీవితచరిత్ర నేపథ్యంలో తనకు తెలిసిన విషయాలతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. జీవీమూవీస్‌ పతాకంపై 'రెడ్డిగారి మనవడు' పేరుతో ఓ రాజకీయ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. 'ప్రిన్స్‌ ఆఫ్‌ రాయలసీమ' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. 

సినిమా గురించి జీవీ చెబుతూ- రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. రాజకీయాలే ఊపిరిగా బతికే ఒక రెడ్డిగారు, ఆయన పుట్టినరోజునాడే పుట్టే ఆయన మనవడి కథ ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేయనున్నాం. ఇందులో మంచి హ్యూమర్‌ డ్రామా ఉంది. గతం, వర్తమానం, భవిష్యత్‌ అంశాలను చూపించనున్నాం అన్నారు. 

నటుడిగా 150 చిత్రాలు చేశాను. ఆత్మసంతృప్తి పొందిన పాత్రలు వేశాను. ఇటీవలే దర్శకత్వం వైపు మారాను. ప్రస్తుతం హిందీలో 'శత్రు' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. అనిల్‌కపూర్‌, నానాపటేకర్‌ కాంబినేషన్‌లో రూపొందిస్తున్నాం. ఇటీవలే బాలకృష్ణకు కూడా కథ చెప్పాను. ఆయనక్కూడా ఈ కథ నచ్చింది. ఆయన ఎప్పుడు డేట్స్‌ ఇస్తే అప్పుడే సినిమా మొదలుపెడతాను అని అన్నారు.