9 జూన్, 2012

ఆసుపత్రి పాలైన నటుడు కార్తీక్

                                                                 Actor Karthik Hospitalized                      నటుడి నుంచి పొలిటీషన్‌గా మారిన తమిళ నటుడు కార్తీక గొంతుసంబంధమైన వ్యాధితో చెన్నయ్‌లోని అపోలో ఆసుప్రతిలో జాయిన్ అయ్యారు. 52 సంవత్సరాల కార్తీకు గత కొంత కాలంగా గొంతుసంబంధమైన వ్యాధితో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కార్తీక్ తెలుగులో అన్వేషణ, అభినందన లాంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు... పుణ్య స్త్రీ, గోపాల్ రావుగారి అబ్బాయి లాంటి చిత్రాల్లో కూడా నటించారు. కార్తీ ప్రముఖ తమిళ నటుడు ముత్తురామన్ కుమారుడు. 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించిన కార్తీక్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
కార్తీక్ కుమారుడు గౌతమ్ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘కడల్' అనే తమిళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. అలాగే రాధ రెండో కుమార్తె(కార్తిక చెల్లెలు)తులసి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు.
మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది. ‘కడలి' టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. తొలుత ఈచిత్రానికి సమంతను తీసుకున్నారు. ఆమెపై కొన్ని కీ సీన్స్ షూట్ చేసాక ఆమెను చిత్రం నుంచి తొలిగించారు. హీరో కన్నా ఆమె పెద్దదిగా కనిపిస్తోందనే ఉద్దేశంతో ఆమెకు బై చెప్పినట్లు సమాచారం. ఇక సఖి తర్వాత మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.