29 జూన్, 2012

గబ్బర్ సింగ్... 50డేస్ రికార్డు ఇన్ 306 సెంటర్స్
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈచిత్రం మెగా అభిమానుల దాహాన్ని తీర్చింది.

గబ్బర్ సింగ్ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ‘గబ్బర్ సింగ్' ప్రస్తుతం 306 థియేటర్లలో రన్ అవుతోంది, ఇది నెం.1 రికార్డు. గతంలో మగధీర చిత్రం 301 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని నెం.1 స్థానంలో ఉండగా తాగా గబ్బర్ సింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇందులో 250కిపైగా డైరెక్టు సెంటర్లు ఉండటం గమనార్హం. ఇప్పటికే గబ్బర్ సింగ్ కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన 81 ఏళ్ల టాలీవుడ్  చరిత్రలో మెగా హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్