10 జూన్, 2012

చిరంజీవి 150వ సినిమా ఖరారు

                               AA
చిరంజీవి 150వ సినిమా మొదలవబోతోంది. రామ్‌చరణ్‌ నిర్మాతగా ప్రారంభమౌతున్న ఈ సినిమా రాజకీయ నేపధ్యంగానే ఉంటుందంటున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఎఐసిపి ప్రతినిధి వాయలార్‌ రవి కూడా జనాన్ని కదిలించే పొలిటికల్‌ మూవీ ప్లాన్‌ చేయమని సలహా ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. టైటిల్‌ బయటకు వచ్చిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందని తెలుస్తోంది.