25 మార్చి, 2012

నాకు ధనుష్‌కు మధ్య అటువంటిదేమీ లేదు: శృతిహాసన్

              

హైదరాబాద్‌లో జరిగిన "త్రీ" సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ఫాల్గొనేందుకు వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ కార్యక్రమం తర్వాత జరిగిన విలేఖర్ల సమావేశంలో ఎన్నో వదంతులకు ముగింపు పలికారు. "త్రీ' సినిమాలో ధనుష్‌తో నటించాను. ఆయనొక మంచి నటుడు. ఒక సినిమాలో ఇద్దరం కలిసి నటించామే తప్ప మామధ్య అంతకుమించి ఇంకేమీ లేదు, ఉండే అవకాశమూ లేదు అని సమాధానమిచ్చారు.

ధనుష్‌తో ఏమీ లేదంటే...... సిద్ధార్థతో ఏదో ఉంది అనే ఆలోచన రావడం సహజమే కదా? అదే అడిగితే... ఇంతవరకూ మా ఇద్దరి మధ్యా ఎలాంటి స్నేహమూ లేదు. స్నేహం ఉంటేనే కదా దెబ్బతినడానికి అని ఎదురు ప్రశ్న వేశారు. పైగా తామిద్దరం కలిసి ఒకటి రెండు చిత్రాలలో నటించాం అంతే. వృత్తి పరంగా మాట్లాడుకోవడమే తప్ప తమ మధ్య ఇంకేమీ లేదు అని స్పష్టం చేసింది. 

"త్రీ" సినిమా తెలుగు, తమిళ భాషల్లో తప్పకుండా హిట్ అవుతుంది. ఇది ఒక మంచి కథ, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ కథని ఐశ్వర్య చాలా అద్భుతంగా తెరకెక్కించారు అని ఆమెను ప్రశంసిం చారు.http://www.mulakkada.com/