24 మార్చి, 2012

నావల్ల కానిది అతను సాధించాడు : వర్మ

RGV applauds 'Ee Rojullo' Team
‘ఈ రోజుల్లో’ చిత్ర దర్శకుడు మారుతిపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రం చూసిన అనంతరం వర్మ మాట్లాడుతూ... ‘నేను 5డి కెమెరా తో పెద్ద స్టార్లను నటింపచేసి సాదించలేని విజయాన్ని ‘ఈ రోజుల్లో’ చిత్ర బృందం అదే 5డి కెమెరా ఉపయోగించి విజయం సాధించింది. దొంగలముఠా ప్లాప్ కావడంతో తెరమరుగయిన ఈ టెక్నాలజీని ఈరోజుల్లో సినిమాతో నిరూపించిన మరుతి నిజమైన ట్రెండ్ సెట్టర్’ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. 

నూతన తారలు శ్రీనివాస్, రేష్మా జంటగా గుడ్ సినిమా గ్రూప్, మారుతి మీడియా హౌస్ పతాకాలపై రూపొందిన 'ఈ రోజుల్లో' చిత్రం ఈ నెల ఉగాది(మార్చి 23) రోజున విడుదలయింది. మారుతి దర్శకుడిగా పరిచయమయిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్.కె.ఎన్. డబ్బుంటేనే అమ్మాయిలు తమ దగ్గరకు వస్తారని అబ్బాయిలు, అబ్బాయిలకు కావలసింది తమ శరీరమే కానీ, మనసు కాదని అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. ప్రేమని నమ్మని ఓ అబ్బాయి, అబ్బాయిల స్నేహాన్ని నమ్మని ఓ అమ్మాయి మధ్య ఏర్పడ్డ పరిచయం ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించింది అనే కథాంశంతో ఈచిత్రాన్ని రూపొందించారు.

ఎమ్మెస్ నారాయణ, అంబటి శ్రీనివాస్, మధుమణి, శంకర్‌రావు, భార్గవి, వెంకీ, విష్ణుప్రియ, రక్షిత, బిందు తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: కరుణాకర్, కాసర్ల శ్యామ్, ఛాయాగ్రహణం: జె. ప్రభాకరరెడ్డి, కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, సహ నిర్మాత: ఎం. శివరామిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి. 

1 వ్యాఖ్య:

Satish B చెప్పారు...

yes very good moive congrats to director