24 మార్చి, 2012

ఎన్టీఆర్, చరణ్‌లను ఓవర్ టేక్ చేసిన రానా

                         Naa Ishtam

టాలీవుడ్‌లో బాబాయ్-అబ్బాయ్‌ల కాంబినేషన్లపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలసిందే. బాలకృష్ణ-జూ ఎన్టీఆర్....పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలని నందమూరి, మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరో వైపు వెంకటేష్-రానా కలిసి నటిస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు కూడా ఆశ పడుతున్నారు.

అభిమానుల కోరికను తీర్చే క్రమంలో దగ్గుబాటి రానా....జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కంటే ముందున్నాడు. త్వరలోనే బాబాయ్‌ వెంకటేష్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఫైనలైజ్ అవుతుందని రానా చెప్పారు. వ్యక్తిగతంగా తమ సినిమాలు ఎలా ఆడాయి అనే విషయం ఇక్కడ ప్రాధాన్యం కాదు.....బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది అనేదానిపై ప్రేక్షకులు ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే కథ, స్క్రిప్టు పక్కాగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నా అని రానా చెప్పారు.

ప్రస్తుతం రానా...క్రిష్ దర్శకత్వంలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా బాలీవుడ్‌లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘డిపార్ట్‌మెంట్’ చిత్రంలో నటిస్తున్నాడు. రానా తాజా చిత్రం ‘నా ఇష్టం’ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.