24 మార్చి, 2012

దూకుడు నిర్మాతలకు జూ ఎన్టీఆర్ షాక్!

Jr Ntr 

‘దూకుడు’ చిత్ర నిర్మాతలకు నందమూరి చిన్నోడు జూ ఎన్టీఆర్ షాకిచ్చాడు. అతనితో సినిమా చేద్దామని వచ్చిన వారి ప్రతిపాదనను తిరస్కరించాడు. తాము కొంతకాలం వెయిట్ చేయడానికైనా సిద్ధమే...మీరు మాతో చేస్తానని ఓకే చెప్పండి అని వారు అడుగగా తన డేట్స్ 2015 వరకు ఖాళీ లేవని షాకింగ్ న్యూస్ చెప్పాడట. దీంతో చేసేది లేక డిసప్పాయింట్ అయి అక్కడి నుంచి ఆ నిర్మాతలు నిష్ర్కమించారని సమాచారం. 

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘దమ్ము’చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో త్రిష, కార్తీక జూనియర్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రానికి కమిట్ అయ్యారు. 2013లో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈచిత్రం తర్వాత కెఎస్ రామారావు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడని, ఈ చిత్రంలో జూనియర్ అత్యధికంగా రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని చర్చించుకుంటున్నారు.

అయితే 2015 వరకు తనకు ఖాళీ లేదని జూ ఎన్టీఆర్ చెప్పడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. బయటకు తెలియని సినిమాలు ఆయన ఇంకా ఏమైనా కమిట్ అయ్యారా? లేక దూకుడు నిర్మాతలతో చేయడం ఆయనకు ఇస్టం లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.