24 మార్చి, 2012

రహస్యంగా పని ముగించిన ఎస్.పి.బాలు

                      S P Balasubramaniam
ఏ తండ్రయినా తన కొడుకు ఎదుగుతుంటే గర్వంగా ఫీలవుతాడు. అతడు ఓ స్తాయిలో ఉంటే చూసి మురిసి పోతాడు. కానీ ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు మాత్రం ఆ అదృష్టం లేనట్లే కనిపిస్తోంది. ఆయన తనయుడు ఎస్.పి. చరణ్ సినీ నిర్మాతగా మారి అనేక సమస్యల్లో ఉన్నాడు. సోనా అనే ఐటం బాంబుపై చరణ్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సోనా మీడియాకెక్కడం ఆ మధ్య చర్చనీయాంశం అయింది. 

ఇక పోతే....దర్జాగా, ఠీవీగా తిరుమలను దర్శించుకోవాల్సిన ఎస్.పి. బాలు కొడుకుపై ఉన్న ఆరోపణల కారణంగా.....రహస్యంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారట. ఇటీవల ఆయన తన కొడుకు కష్టాలు తీరాలని వెంకన్నను కోరుకునేందుకు రహస్యంగా తిరుమల వచ్చిన వెళ్లినట్లు సమాచారం. మీడియా కంట పడితే అనవసర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతారనే కారణంతోనే రహస్యంగా పని ముగించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.