26 మార్చి, 2012

రిస్క్ తీసుకుంటున్న రామ్ చరణ్... టెన్షన్

                             Ram Charan Teja

రామ్ చరణ్ తేజ్ మొన్న రచ్చ షూటింగ్ లో దెబ్బ తగలిన సంగతి తెలిసిందే. అప్పుడు డాక్టర్ల నెల రోజులు పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయితే రచ్చ రిలీజ్ డేట్ ఏప్రియల్ 5 న ఎట్టి పరిస్ధితుల్లోనూ రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉండటంతో కంటిన్యూగా షూట్ లో పాల్గొంటున్నారు. అందులోనూ ఎక్కువ ఒత్తిడికి గురి చేసే పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. అంతేగాక ఈ షూటింగ్ లేటయితే జంజీర్ కి ఇచ్చిన డేట్స్ కి ఇబ్బంది ఎదురవుతుందని,తన మొదటి బాలీవుడ్ వెంచర్ కాస్త ఇలా మొదట్లోనే ఇబ్బంది ఎదురైతే కష్టం అని కంటిన్యూగా పని చేస్తున్నారు. 


అయితే ఇది కుటుంబ సభ్యులకు టెన్షన్ కలిగిస్తోందని ఫిల్మ్ సర్కిల్సో లో వినపిస్తోంది. వద్దన్నా వినకుండా ఇలా రెస్ట్ లెస్ గా పనిచేయటం వారికి భాధ కలిగిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఉడ్ బి ఉపాసనా కామినేని కూడా చాలా స్పష్టంగా చరణ్ ని రెస్ట్ తీసుకోమని చెప్పినా వినలేదుట. ముందు పని, ఆ తర్వాతే మరేదైనా అనే కాన్సెప్టులో ముందుకు వెళ్ళుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న రచ్చ లో హీరోయిన్ గా తమన్నా చేస్తోంది. సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది.