24 మార్చి, 2012

చిరు మేనల్లుడి చిత్రం పరిస్థితి....క్రై ఫర్ హెల్ప్!

                                    Sai Dharamteja

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘రేయ్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభం అయి సంవత్సరాలు గడిచి పోతోంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. ఈచిత్రాన్ని మధ్యలో ఆపి రవితేజ హీరోగా ‘నిప్పు’ చిత్రాన్ని నిర్మించిన వైవిఎస్...ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆర్థికంగా బాగా నష్టం పోయాడని, దీంతో రేయ్ సినిమాను ముందుకు నడిపించలేని పరిస్థితిలో ఉన్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఇన్నేళ్లయినా తన మేనల్లుడి సినిమా ముందుకు సాగక పోవడాన్ని గమనించిన చిరు, వైవిఎస్‌ను పిలిచి ఆరా తీయగా అసలు విషయం చెప్పాడట. దీంతో చిరంజీవి సూచన మేరకు తన వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఈ చిత్రం నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. గతంలో ఈ సినిమా గురించి చౌదరిని ప్రశ్నిస్తే...కొన్ని సమస్యల వల్ల సినిమా పూర్తి కాలేదు. ఆ సమస్యల గురించి రాస్తే ఓ పెద్ద పుస్తకం తయారవుతుందన్నారు. ఈ సినిమా పరిస్థితిని గమనించిన వారంతా...ఈ చిత్రానికి పెట్టిన ఉప శీర్షిక ‘షౌట్ ఫర్ సక్సెస్’ కాస్తా....‘క్రై ఫర్ హెల్ప్’ అన్న చందంగా తయారైంది అంటున్నారు. మరి ఈ కష్టాల నుంచి ఈ సినిమా గట్టెక్కేది ఎన్నోడు..? థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడో..?