28 మార్చి, 2012

రాజమౌళి 'ఈగ'కు ఆ ఏడుగురు హీరోలు

                                      Eega


రాజమౌళి తాజా చిత్రం ఈగ ఆడియో పంక్షన్ కి తెలుగు ఇండస్ట్రీలోని ఏడుగురు హీరోలు హాజరవుతున్నట్లు సమాచారం. రాజమౌళి దర్సకత్వంలో చేసిన ఆ హీరోలు...ఎన్టీఆర్,రామ్ చరణ్,నాగార్జున,ప్రభాస్,రవితేజ,నితిన్,సునీల్ వస్తున్నారు. ఆ పంక్షన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న జరిగే ఈ పంక్షన్ గచ్చిబౌలి లోని బ్రహ్మ కుమారి అకాడమిలో జరగనుంది. ఈ హీరోలే కాక ఇండస్ట్రీలోని పెద్దలు చాలా మంది ఈ పంక్షన్ కి వస్తున్నారు. 'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని రాజమౌళి ఈ చిత్రం గురించి అన్నారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెబుతూ సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌ బాబు.