24 మార్చి, 2012

వర్మ వల్లే తప్పుచేశానంటున్న అమలపాల్

                              Amala Paul

తన సెక్సీ లుక్స్‌తో యూత్ గుండెల్లో గునపాలు దించుతున్న అమలపాల్ నాగ చైతన్య ‘బెజవాడ’చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా పరమ ప్లాపు కావడంతో అమల పాల్ తెలుగు ఎంట్రీ చాలా బ్యాడ్ గా స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రం మాత్రం ఆమెకు మంచి ఫలితాలనే ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమల పాట్లాడుతూ....‘బెజవాడ సినిమాలో నటించడానికి ఒప్పుకుని పెద్ద తప్పు చేశానని, అయితే ఆ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం రామ్ గోపాల్ వర్మనే, ఆయన సినిమా అనే ఒకే ఒక కారణం వల్లనే సైన్ చేశాను, ఆ సినిమా చేసి ఉండక పోయి ఉంటే తనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చేవి’ అని అంటోంది.

అవ్ ఫెయిల్యూర్ చిత్రంలో అమలపాల్ నటనకు, అంద చందాలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో ఆమె బబ్లీ యాక్టింగ్ చాలా మంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ భామ ఓ తమిళ చిత్రం, ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. బెజవాడ సినిమా చేయకముందే చాలా మంది తెలుగు దర్శకులు తనపై ఇంట్రస్టు చూపారని, బెజవాడ సినిమా చేయడం, అది ప్లాపు కావడంతో దర్శక నిర్మాతలకు తనపై ఆసక్తి తగ్గిందని వాపోతోందట.