25 మార్చి, 2012

లోకల్ మీడియాను కడిగిపారేసిన జెనిలియా

                                            Geniliya
www.mulakkada.com
రానా సరసన తాను హీరోయిన్‌గా నటించిన 'నా ఇష్టం' చిత్రం ప్రచార కార్యక్రమంలో బాగంగా హైదరాబాద్ వచ్చింది. ఆమె వచ్చినందుకు ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో జెనీలియాకు మీడియా వ్యక్తులు అడిగిన ఒక ప్రశ్న చాలా కోపం తెప్పించింది. ఆ ప్రశ్న మరేదో కాదు భూకబ్జాకు సంబంధించిన వ్యవహారం. దానిపై జెనిలియా మండిపడుతూ.. ''భూకబ్జా వ్యవహారంలో నా ప్రమేయం ఉన్నట్టుగా తెలిపే ఎలాంటి పత్రాలు కానీ స్టేట్‌మెంట్‌ కానీ నాకు అందలేదు. న్యూస్ పేపర్స్ ద్వారానే నాకు ఆ సంగతి తెలిసింది. అంజనీపుత్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు(హైదరాబాద్‌లో ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్ధ) నేను బ్రాండ్‌ ఎంబాసిడర్‌ను కాదు కదా ఆ కంపెనీకి చెందిన బోర్ట్‌ ఆఫ్‌ డైరక్టర్‌ను కూడా కాను. వారి కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చాను. అంతకుమించి ఆ కంపెనీతో నాకెలాంటి సంబంధం లేదు. మీడియా చాలా బాధ్యతాయుతంగా వార్తలు రాయాలి. ఎలాంటి భూకబ్జా వ్యవహారాల్లో నా ప్రమేయం లేదు'' అని జెనీలియా వివరించింది. ఇక ఆమె నా ఇష్టం చిత్రం ఉగాది రోజు అంటే మార్చి 23న విడుదలైంది. సినిమా మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.