24 మార్చి, 2012

మాకు ఆ దమ్ముంటే అభిమానులు కూడా.. : బాలయ్య

Balakrishna

వెరైటీ సినిమాలు తీసే దమ్ము మాకు ఉండాలేకానీ ప్రేక్షక దేవుళ్లెప్పుడూ వాటిని ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు...అని వ్యాఖ్యానించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రభుత్వం కూడా నటుల ప్రతిభను గుర్తించి అవార్డులు అందజేయడం అభినందనీయం అన్నారు. ఉగాది సందర్భంగా జరిగిన నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2010 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయన మాట్లాడుతూ...‘‘ఇది నా రెండో నంది. తొలిసారి ‘నరసింహ నాయుడు’కి తీసుకున్నాను. ఇప్పుడు ‘సింహా’ చిత్రానికి తీసుకుంటున్నా. ఎన్నో వైవిధ్యమైన పోషించిన నాన్నగారిలాగే...నన్ను కూడా ప్రేక్షకులు, అభిమానులు ఆదరించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉందని, అభినులందరికీ నా ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బాలయ్యను ప్రత్యేకంగా సన్మానించారు. అభిమానులు ఆయనపై పూల వర్షం కురిపించారు.

బాలయ్య ప్రస్తుతం ‘అధినాయకుడు’ చిత్రంలో నటిస్తున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని నటిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.