26 మార్చి, 2012

మైకెల్ జాక్సన్ గెటప్ లో పవన్ కళ్యాణ్

                                     Gabbar Singh  


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో మైకల్ జాక్సన్ గెటప్ లో కొద్ది క్షణాలు పాటు కనిపించి అభిమానులను అలరించనున్నారు అని సమాచారం. అది ఓ మెలోడీ పాట సీక్వెన్స్ లో వస్తుందని చెప్పుకుంటున్నారు. సినిమా హైలెట్స్ లో అది ఒకటిగా ప్రచారం జరుగుతోంది. అలాగే మిగతా హైలెట్స్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ లో ముఠా మేస్త్రి సాంగ్ రావటం వస్తుంది. అలాగే ఇది ఓ ఫైట్ సీక్వెన్స్ లో వస్తుంది. ఇక పంచ్ తో వచ్చే పవర్ ఫుల్ డైలాగులు మాస్ ని ఆకట్టుకుంటాయని అవే సినిమాలో హెలెట్స్ అంటున్నారు. 
సినిమా పూర్తిగా కామెడీతో పంచ్ లతో రన్ అయ్యేటట్లు ఒరిజనల్ దబాంగ్ ని మార్చి స్క్రిప్టు వండటం కలిసి వచ్చే అంశం అంటున్నారు. సెకండాఫ్ లో బ్రహ్మానందం,పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కామెడీ ఎపిసోడ్ దాదాపు ఓ అరగంట సేపు కంటిన్యూ నవ్వులు పూయిస్తుందని,హైలెట్స్ అధి కూడా ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఫైనల్ గా క్లైమాక్స్ కూడా తెలుగు ప్రేక్షకులకు తగినట్లు భారీ కార్ ఛేజింగ్ లతో షూట్ చేసి శభాష్ అనిపించుకునేందుకు హరీష్ శంకర్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ నటిస్తోంది.