29 మార్చి, 2012

రవితేజ ‘దరువు’ చిరు సినిమా రీమేకా?

                                         Daruvu

మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దరవు’. మాస్ ఆఫ్ సౌండ్ అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ నెలలో ఆడియో విడుదల చేసి...పోస్టు ప్రొడక్షన్ పనులు ముగిసన అనంతరం మే 4న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సోషియో ఫాంటసీ నేపథ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది.తాజాగా చిత్రం గురించి వినిపిస్తున్న ఓ వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’ చిత్రం ఆధారంగా, ఒకరకంగా ఆ చిత్రానికి రీమేక్‌గా దరువు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆ సినిమాలో యమ ధర్మరాజుగా కైకాల సత్యనారాయణ నటిస్తే..ఈ చిత్రంలో యంగ్ యమ ధర్మరాజుగా తమిళ నటుడు ప్రభు నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో సినిమా విడుదలైతేగానీ తెలియదు.రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ