24 మార్చి, 2012

అభిమానిపై ఆఫ్రిది దాడి


పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరో వివాదంలో ఇరుక్కున్నాడు. విమానాశ్రయంలో ఆటోగ్రాఫ్ అడిగిన అభిమానిపై అతడు దాడికి పాల్పడ్డాడు. పింకు రంగు టీ-షర్ట్ వేసుకున్న ఆఫ్రిది అభిమానులు తిడుతూ, కొడతానని హెచ్చరిస్తున్న దృశ్యాలను జియో న్యూస్ పాటు స్థానిక వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. ఢాకా నుంచి తిరిగొచ్చిన ఆఫ్రిది ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు. అయితే తన చిన్నారి కూతురిని అభిమానులు తోసేయడంతో అతడికి ఆగ్రహం వచ్చిందని మరో చానల్ వెల్లడించింది. మరోవైపు ఆసియాకప్ గెల్చుకుని వచ్చిన తమ జట్టుకు స్వాగతం పలికేందుకు పాక్ అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు.